వైరల్ అవుతున్న కీర్తి దసరా డబ్బింగ్ వీడియో

Keerthy Suresh's Dubbing Video from Dasara Goes Viral

నేను లోకల్ తరువాత నాని,కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం దసరా.రీసెంట్ గా విడుదలైన ఈ చిత్రం 100కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ అనిపించుకుంది. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ ఈసినిమా మంచి వసూళ్లను రాబడుతుంది.నాని, కీర్తి సురేష్ ల నటన, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ సినిమాను నిలబెట్టాయి.రూరల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈసినిమాలో నాని,ధరణి గా కీర్తి,వెన్నెల గా నటించింది.ఇక ఈసినిమా నుండి విడుదలైన కీర్తి పెళ్లి సాంగ్ వీడియోకి సెన్సేషనల్ రెస్పాన్స్ రాగ మూడు రోజుల క్రితం ఓ డిలేటెడ్ సీన్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ వీడియోకి ఇప్పటివరకు 17లక్షల వ్యూస్ తో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.1:46 నిమిషాల ఈవీడియోలో వెన్నెల తన తల్లి తో మాట్లాడుతూ కనిపించింది.ఇక తాజాగా ఈసీన్ కు డబ్బింగ్ చెప్తున్న కీర్తి సురేష్ వీడియో కూడా విడుదలైంది.తెలంగాణ యాస నేర్చుకొని యాక్టింగ్ చేస్తూ కీర్తి డబ్బింగ్ చెప్పిన విధానానికి వీడియోను చూసినవారు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈవీడియో వైరల్ అవుతుంది.

శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈచిత్రం యూఎస్ఏ లో నానికి కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను అందించింది. దసరా ఇప్పటివరకు అక్కడ ఏకంగా 2మిలియన్ల కు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా సుధాకర్ చెరుకూరి నిర్మించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − five =