న్యాచురల్ స్టార్ నాని మరోసారి తన నటనతో తన సత్తాను చూపించాడు. ఏ పాత్ర చేసినా దానికి ప్రాణం పోస్తాడు అన్న విషయం దసరాతో మరోసారి నిరూపించాడు. గతంలో మాస్ పాత్రలు చేసినా దసరా లో మాత్రం ఊర మాస్ పాత్రలో చెలరేగిపోయాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈసినిమా మార్చి 30వ తేదీన రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కేవలం ఒక్క వర్గానికి మాత్రమే కాదు అన్ని వర్గాల వారికి ఈసినిమా నచ్చడంతో సినిమా అంత ఘనవిజయాన్ని అందుకుంది. శ్రీకాంత్ మేకింగ్ ను అందరూ ప్రశంసిస్తున్నారు. ఇక నాని తో పాటు అంతే పోటీగా కీర్తి సురేష్ నటన కూడా సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇంకా యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా అన్ని అంశాలు సినిమా విజయానికి ప్రధాన బలమయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కలెక్షన్స్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈసినిమా 110 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఒక్క రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 50 కోట్ల షేర్ ను సొంతం చేసుకుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడంతో దసరా సినిమాకు కలిసిరానుంది. ఎలాంటి పోటీ లేకపోవడంతో ఇంకా కలెక్షన్స్ ను రాబట్టుకునే అవకాశం ఉంది. ఇక ఇక్కడ మాత్రమే కాదు ఈసినిమా యూఎస్ లో కూడా తన హవా చాటుతుంది. అక్కడ ఈసినిమా 2 మిలియన్ డాలర్ల మైల్ స్టోన్ ను అందుకుంది.
కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా…. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటించారు. చెరుకూరి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విజయ్ చాగంటి వ్యవహరించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: