AK 62 నుండి అందుకే తప్పుకున్నా

vignesh shivan gives clarity about why he walked away from AK62 movie

తమిళ్ స్టార్ హీరో అజిత్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది వాలిమై, ఈ ఏడాది తునివు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు మరో సినిమాతో రెడీ అయిపోయాడు. అజిత్ 62వ సినిమా చేయబోతున్నాడు. నిజానికి ఈసినిమాను ముందు విఘ్నేష్ శివన్ డైరెక్టర్ చేయబోతున్నట్టు ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే కదా. అజిత్ నుండి రీసెంట్ వచ్చిన వాలిమై కానీ, తునివు సినిమా కానీ ఫుల్ యాక్షన్ సినిమాలు. మరోవైపు విఘ్నేష్ శివన్ సినిమలు ఎమోషన్స్ ఇంకా ఫీల్ గుడ్ తో ఉంటాయి కాబట్టి అజిత్ కు కూడా రొటీన్ కాకుండా వేరే పాత్రలో నటించే అవకాశం ఉంటుందని ఫ్యాన్స్ కూడా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి సమయంలో సడెన్ గా ఈ సినిమా నుండి విఘ్నేష్ తప్పుకొని షాక్ ఇచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా తాను ఈసినిమా నుండి బయటకు గల కారణం ఏంటో చెప్పాడు. ఈసినిమా సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ లో ఛేంజస్ చేయమని నిర్మాత చెప్పడం జరిగింది.. దానితో ఇద్దరికీ కదరలేదు.. అజిత్ కు కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవు దానితో ఈ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఫ్యూచర్ లో ఖచ్చితంగా అజిత్ తో నా స్క్రిప్ట్ తో సినిమా తీస్తాను అని చెప్పుకొచ్చాడు.

కాగా ఈసినిమాకు మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహించబోతున్నాడు. ఇంకా ఈసినిమాలో ఐశ్వర్యరాయ్, అరవింద్ స్వామి కీలక పాత్రల్లో నటించబోతున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్‌కరణ్ నిర్మిస్తుండగా. నిర్మాణ బాధ్యతలను జీకేఎం తమిళ కుమరన్ నిర్వహించనున్నారు. అనిరుథ్ ఈసినిమాకు సంగీతం అందించనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.