శాకుంతలం ప్రీమియర్ షోకి షాకింగ్ రెస్పాన్స్

Shaakuntalam Movie Premiere Show Response

మచ్ అవైటెడ్ మూవీ శాంకుతలం మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.గుణశేఖర్ దీనికి డైరెక్టర్ కావడం సమంత టైటిల్ రోల్ లో నటించడం తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.అలాగే రిలీజైన ట్రైలర్లకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో శాకుంతలం విడుదలకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఫలితంపై మూవీ టీం కాన్ఫిడెంట్ గా ఉంది.దాంతో నిన్న రాత్రి హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీ ఫ్లెక్స్ లో పబ్లిక్ రెస్పాన్స్ కోసం స్పెషల్ షో వేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈషో చూసిన వారి దగ్గరనుండి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.సినిమాలో సమంత యాక్టింగ్, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అలాగే గ్రాఫిక్స్ బాగుందని అంటున్నారు.3డి వెర్షన్ లో సినిమా చూడడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని చెపుతున్నారు.ఇక ఈసినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ యాక్టింగ్ మరో హైలైట్ అంట.అల్లు అర్హ ఈసినిమాలో శకుంతల,దుష్యంతుడి కుమారుడు,భరతుడిగా నటించింది. ఈపాత్రలో అర్హ చాలా బాగా చేసిందని.. చాలా సహజంగా నటించడమే కాదు డైలాగ్స్ కూడా అద్భుతంగా పలికిందని అంటున్నారు.ప్రీ క్లైమాక్స్ లో ఈపాత్ర ఎంట్రీ ఇస్తుందట. దాదాపు 15నిమిషాల పాటు అర్హ స్క్రీన్ మీద కనబడనుంది.సో ఓవరాల్ గా సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమా యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తుంది.

మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కిన ఈసినిమాలో దుష్యంతుడి గా దేవ్ మోహన్,దుర్వాస ముని పాత్రలో మోహన్ బాబు కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో నీలిమ గుణ నిర్మించిన ఈచిత్రానికి దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.ఈనెల 14న ఈ చిత్రం తెలుగు తోపాటు హిందీ,తమిళ,మలయాళ,కన్నడ భాషల్లో 2డి తోపాటు 3డి లోకూడా విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 5 =