స్టార్ హీరో, హీరోయిన్లు సైతం ఈమధ్య మల్టీస్టార్లర్లు తీయడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు. ఒకప్పుడు కూడా మల్టీస్టారర్లు ఉండేవి.. అయితే ఆతరువాత హీరోలు సోలోగానే చేయడానికి ఇష్టపడేవారు. కానీ ఈమధ్య సినిమా పరిశ్రమల్లో మారుతున్న పరిస్థితులను బట్టి నటీనటులు కూడా అందుకు అనుగుణంగా సినిమాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాలో చేయడమే కాదు.. ఇతర ఇండస్ట్రీల్లో సైతం చేయడానికి సిద్దపడిపోతున్నారు. హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు కూడా మల్టీస్టారర్ చేయడానికి ముందుకొస్తన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా అలాంటి ఐడియానే ఒకటి వేశారు స్టార్ హీరోయిన్ సమంత, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్.
శాకుంతలం సినిమా గురించి మృణాల్ తన ట్విట్టర్ లో ఈసినిమా చూడటం కోసం వెయిట్ చేయలేకపోతున్నా.. మనమిద్దరం కలిసి ఎప్పుడు సినిమా చేస్తున్నాం అంటూ ట్వీట్ చేసింది. ఇక దీనికి సామ్ స్పందిస్తూ.. కంగ్రాట్స్ బ్యూటిఫుల్ మృణాల్, ఐడియా బాగుంది చేద్దాం అంటూ రిప్లై ఇచ్చింది. మరి ఐడియా అయితే థ్రిల్లంగ్ గానే ఉంది.. మరి వీరిద్దరి కోసం కథ ఎవరు రెడీ చేస్తారు.. ఏ డైరెక్టర్ తీయడానికి ముందుకొస్తాడు.. మృణాల్ కల ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.
Congratulations on #Gumraah beautiful @mrunal0801 🤍
Let’s do it.. 💪🏼 love the idea!! https://t.co/rqQqSbXWER— Samantha (@Samanthaprabhu2) April 9, 2023
ప్రస్తుతం సమంత తన శాకుంతలం సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంది. దీనితో పాటు పలు సినిమాలో అలానే వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. మరోవైపు సీతారామం సినిమతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం నాని 30వ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: