ఈనెలలో మోస్ట్ అవైయిటెడ్ సినిమాల్లో సమంత ప్రధాన పాత్రలో వస్తున్న శాకుంతలం సినిమా ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈసినిమాను రూపొందించాడు. ఈసినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరోవైపు చిత్రయూనిట్ వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. పలు భాషల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి గట్టిగానే ప్రమోషన్స్ చేస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, పాటలు, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా చిత్రయూనిట్ రీసెంట్ గా ఓవీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ వీడియోలో సమంత ఈసినిమా కోసం మూడు భాషల్లో డబ్బింగ్ చెప్పాను.. వేరే నటీనటులు ఎలా చెబుతున్నారో నాకు తెలియదు కానీ.. ఇలా డబ్బింగ్ చెప్పడం కష్టం అంటూ తెలిపింది. నేను నిద్రలో కూడా డైలాగ్స్ రిహార్స్ చేస్తుండేదాన్ని.. బాగానే చెప్పాను అనుకుంటున్నాను.. ఆడియన్స్ రెస్పాన్స్ కూడా వెయిట్ చేస్తున్నాను అంటూ తెలిపింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా.. అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈసినిమాను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. విజువల్ వండర్‌గా త్రీడీ టెక్నాలజీతో తెలుగు, హిందీ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో శాకుంతలం సినిమా విడుదలవుతుంది. ఏప్రిల్ 14న 2D, 3D వెర్షన్స్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: