సందీప్ కిషన్ మైఖేల్ ట్రైలర్ రిలీజ్

Sundeep Kishan Michael Movie Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Michael,Michael Movie,Michael Telugu Movie,Michael Movie Updates,Michael Telugu Movie Latest News,Michael Trailer,Michael Movie Trailer,Michael Telugu Movie Trailer,Michael Official Trailer,Sundeep Kishan Michael Trailer,Sundeep Kishan Michael Movie Trailer,Sundeep Kishan Michael Telugu Movie Trailer

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నుండి కొత్త సినిమా చాలా రోజులైపోయింది. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ సరైన విజయాన్ని అందుకోలేకపోతున్నారు. దీంతో ఎప్పటినుండో సాలిడ్ హీట్ కోసం ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నాడు. ఈనేపథ్యంలోనే చాలా గ్యాప్ తరువాత మైఖేల్ అనే సినిమాతో వస్తున్నాడు. ఈసినిమాలో తన మేకోవర్ ను ఫుల్ గా మార్చేశాడు సందీప్ కిషన్. ఇక ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. అంతేకాదు ఈసారి సందీప్ ఖచ్చితంగా హిట్ కొడతాడన్న అభిప్రాయాన్ని క్రియేట్ చేశాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ నేడు వచ్చేసింది. ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమా ట్రైలర్ ను తెలుగులో నందమూరి బాలకృష్ణ రిలీజ్ చేయగా.. తమిళ్ లో జయం రవి, అనిరుథ్ అలానే మలయాళంలో నివిన్ పౌల్ రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది. సందీప్ కిషన్ మేకోవర్, అలానే యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో దివ్యాంశ కౌశిక్ సందీప్ కు జోడీగా హీరోయిన్ గా నటిస్తుంది. విజ‌య్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ కూడా ఈ సినిమాలో కీలకపాత్ర పోషించడం విశేషం. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =