వీర సింహుని విజయోత్సవ సభలో బాలకృష్ణ స్పీచ్

Balakrishna Speech at Veera Simha Reddy Success Meet,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Balakrishna Powerful Speech,Veera Simha Reddy Success Meet,Balakrishna,Balakrishna Speech,Balakrishna Speech Veera Simha Reddy,Veera Simha Reddy Telugu Movie,Veera Simha Reddy Movie Interview,Thaman S,Gopichand Malineni,Nandamuri Balakrishna,Shruti Haasan,Varalaxmi Sarathkumar,Veera Simha Reddy,Veera Simha Reddy Trailer,Veera Simha Reddy Songs,telugu movies 2023,telugu new movies 2023,Veera Simha Reddy Full Movie

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, విజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వీరసింహారెడ్డి మూవీలో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించిన హీరో బాలకృష్ణ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు. కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బాలకృష్ణ ఈ మూవీకి హైలైట్ గా నిలిచారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ని వీరసింహుని విజయోత్సవం పేరిట హైదరాబాద్ JRC కన్వెన్షన్ లో 22 వ తేదీ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకి చిత్ర యూనిట్ తో పాటు దర్శకులు హరీశ్ శంకర్ , హను రాఘవపూడి, అనిల్ రావిపూడి, శివ నిర్వాణ, బీవీఎస్ రవి, హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ .. ఏ విషయాన్నైనా నిజాయితీగా.. ధైర్యంగా చెప్పడమనేది ఒక గర్జనలా ఉండాలనీ.. అలా ఉండాలంటే నాలా సింహంలా పుట్టాలనీ.. ఈ సినిమాలో ఎదురులేని .. బెదురులేని వీరసింహారెడ్డిని తానేననీ.. చాలా ఏళ్ల తరువాత తాను చేసిన ఫ్యాక్షన్ సినిమా ఇదనీ అన్నారు. తన మేనరిజంలో నుంచే ఒక్కోసారి కథలు పుడుతూ ఉంటాయనీ.. ఆ విషయంలో బోయపాటి సమర్థుడు అనీ..  అలాగే ఈసారి తన మేనరిజంలో నుంచి దర్శకుడు గోపీచంద్ మంచి కథను తీశాడనీ.. అలాంటి ఈ కథను వివిధ ప్రాంతాలకి చెందిన వివిధ భాషల వారు కూడా ఆదరించడం విశేషం అనీ.. ఈ సినిమాకి దునియా విజయ్.. వరలక్ష్మి శరత్ కుమార్ విలనిజం హైలైట్ గా నిలిచిందనీ.. థమన్ ఎస్ పాటలు ప్రాణం పోశాయనీ.. ఈ మూవీని ఆదరించిన అందరికీ ధన్యవాదాలనీ చెబుతూ.. ఈ మధ్య ఏం జరిగినా కేసు బుక్ చేస్తున్నారనీ.. ఇప్పుడు కేసులు పెట్టడం చాలా తేలిక కదా అంటూ బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =