పాప్ కార్న్ ట్రైలర్ రిలీజ్

Popcorn Movie Trailer Out Now,Popcorn Movie Trailer Out Now,Sai Ronak And Avika Gor’s Popcorn Trailer Looks Fresh And Interesting,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Sai Ronak And Avika Gor’s Popcorn Trailer,Sai Ronak,Avika Gor,Popcorn,Popcorn Movie,Popcorn Telugu Movie,Popcorn Trailer,Popcorn Movie Trailer,Popcorn Telugu Movie Trailer,Popcorn Telugu Trailer

లిఫ్ట్ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు రావడం చూశాం. ఇక ఇప్పుడు ఇదే బ్యాక్ డ్రాప్ లో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సాయి రోన‌క్, అవికా గోర్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా పాప్ కార్న్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకునే పనిలో ఉంది. ఇక మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అగ్రహీరో నాగార్జున చేతుల మీదుగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. ఇక ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. హీరో, హీరోయిన్ ఒక మాల్ లో ఉండగా బాంబు పేలుడు సంభవిస్తుంది. ఈనేపథ్యంలో ఇద్దరూ కూడా ఆ మాల్ లోని లిఫ్టులో చిక్కుకుంటారు. ఆ లిఫ్ట్ లో నుంచి .. ఆ మాల్ లో నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారనేది కథ అని అర్థమవుతుంది.

కాగా ముర‌ళి గంధం ద‌ర్శ‌కత్వం వహిస్తున్న ఈసినిమాను ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై బోగేంద్ర గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అవికా గోర్ నిర్మాతగా కూడా మారుతోంది. శ్రావణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈసినిమాని ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =