పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ సినిమా ఏదంటే అందరికీ ఖుషి సినిమానే ముందు గుర్తొస్తుంది. ఎస్ జే సూర్య దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా పవర్ కెరీర్ కే టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఇందులో పవన్ మ్యానరిజం, స్టైల్ అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 2001 ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పటికే వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న పవన్ స్థాయిని ఆకాశానికి ఎత్తేసింది. ఇక ఈ సినిమాలో పవన్‌కు జోడిగా భూమికా చావ్లా నటించింది. వీరిద్దరి కాంబినేషన్ సూపర్. ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నా .. ఎప్పుడూ గొడవ పడే పాత్రల్లో ఇద్దరూ చేసిన నటన యూత్ ను బాగా ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈఏడాదితో ఈసినిమా 21 ఏళ్లను పూర్తిచేసుకుంది. ఇక ఇప్పుడు మరోసారి ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ ఇయర్ ఎండింగ్ సందర్బంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. డిసెంబర్ 31వ తేదీన ఈ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాణ సంస్థ మెగాసూర్య ప్రొడక్షన్ వారు అధికారికంగా తెలియచేశారు.
A Blockbuster for Ages, An OG Love Saga. Re-live Evergreen Romance 😍
Enjoy once again the ever-lasting Magic of love #Kushi, from 31 Dec in theatres near you! ✨ #KushiReRelease @PawanKalyan @iam_SJSuryah @bhumikachawlat @pcsreeram #ManiSharma @AMRathnamOfl pic.twitter.com/r4RegzdkCD
— Mega Surya Production (@MegaSuryaProd) December 19, 2022
కాగా ఈసినిమాలో శివాజీ, నాజర్, విజయ్ కుమార్, సుధ, అలీ, రాజన్ పి.దేవ్, ముంతాజ్, జానకి సబేష్, అజయ్ ముఖ్య పాత్రల్లో నటించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం నిర్మించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: