అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా ఆర్ఎక్స్100. ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ హిట్ కొట్టాడు డైరెక్టర్ అజయ్ భూపతి. ఆర్ఎక్స్ 100 ను కల్ట్ అండ్ బోల్డ్ కంటెంట్ తో రూపొందించాడు. తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాగా విడుదలైన ఆర్ఎక్స్ 100 సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. ఇక ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు అజయ్ భూపతి. రెండో సినిమాగా శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా మహాసముద్రం అనే సినిమాను తీశాడు. ఈ సినిమా మేకింగ్ అప్పుడే కరోనా కూడా రావడంతో తన రెండో సినిమా రిలీజ్ అయ్యే సరికే చాలా టైమ్ పట్టింది. ఇక ఫైనల్ గా రిలీజ్ అయిన ఈసినిమా మంచి విజయాన్నిఅయితే అందించలేకపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మూడో సినిమాకు రెడీ అవుతున్నాడు అజయ్ భూపతి. ఇక ఈసినిమాను తనకు కలిసొచ్చిన జోనర్ లోనే తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమానుకూడా రస్టిక్ అండ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈసినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించనున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నెలాఖరు నుంచి ఈసినిమా సెట్ మీదకు వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా లో ఎక్కువ భాగం నైట్ టైమ్ లోనే జరగనున్నట్టు తెలుస్తుంది. చూద్దాం దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వస్తుందేమో
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: