కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ లూసిఫర్ మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ దసరా పండగ కానుకగా అక్టోబర్ 5వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.గాడ్ ఫాదర్ మూవీ సక్సెస్ సందర్భంగా చిరంజీవి , పూరి జగన్నాథ్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ లో సంభాషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీతో లైవ్ లో మాట్లాడే అదృష్టం కలిగినందుకు చాలా సంతోషంగా ఉందనీ , తన జీవితంలో మధురమైన క్షణం అనీ పూరి చెప్పగా ఎప్పుడు ఏం జరగాలో పై వాడు నిర్ణయిస్తాడనీ చిరంజీవి చెప్పారు. గాడ్ ఫాదర్ మూవీ ఫస్ట్ హాఫ్ కె బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందనీ , ఈ సినిమా సక్సెస్ ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారని చిరంజీవి ని పూరి అడగగా ఈ సినిమా ను ఆదరించిన ప్రేక్షక , అభిమానులకు థ్యాంక్స్ అనీ , అందరితో పాటు తాను కూడా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాననీ , చెప్పారు. కథలు ఎంపిక గురించి చిరంజీవి మాట్లాడుతూ కథ విన్నప్పుడు ఒక ప్రేక్షకుడిలా ఆలోచించి సినిమా ఓకే చేస్తాననీ , రోజూ పని లో (షూటింగ్ )ఉంటే ఒక జోష్ ఉంటుందనీ , తనకు ఇష్టమైన పొలిటికల్ లీడర్స్ లాల్ బహదూర్ శాస్త్రి , వాజ్ పాయ్ అనీ చెప్పారు. గాడ్ ఫాదర్ మూవీ డైరెక్టర్, యాక్టర్స్ , మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పమని పూరి చిరంజీవి ని అడిగారు. ఫస్ట్ టైమ్ సల్మాన్ ఖాన్ ను ఒక కూల్ డ్రింక్ యాడ్ లో కలిశాననీ , అప్పటినుంచీ ప్రాణ స్నేహితుడిగా మారాడనీ , ఈ మూవీ ని దర్శకుడు మోహన్ రాజా అద్భుతంగా తెరకెక్కించారనీ , నయన తార వెరీ కోపరేటివ్ అనీ , తన క్యారెక్టర్ ను అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారనీ , సత్యదేవ్ వండర్ ఫుల్ యాక్టర్ అనీ , ఫ్యూచర్ లో పెద్ద స్టార్ అవుతారనీ , థమన్ ఎస్ తన అద్భుతమైన రీ రికార్డింగ్ తో మూవీ కి హైప్ తెచ్చారనీ , మీరు కూడా మీ క్యారెక్టర్ కు పూర్తి న్యాయం చేశారనీ , ఈ మూవీ సీరియస్ స్టోరీ అనీ , రాబోయే MEGA 154 , భోళాశంకర్ పూర్తి ఎంటర్ టైన్ మూవీస్ అనీ చిరంజీవి చెప్పారు. పూరి మాట్లాడుతూ లైగర్ మూవీ ని ఎంజాయ్ చేస్తూ తెరకెక్కించాననీ , కానీ ఫెయిల్యూర్ అయిందనీ చెప్పగా , ఆ ఫెయిల్యూర్ ను ఛాలెంజ్ గా తీసుకుని న్యూ ప్రాజెక్ట్స్ తో ముందుకు పోవాలనే చిరంజీవి చెప్పారు. మనిద్దరి కలయిక లో తెరకెక్కాల్సిన ఆటో జానీ కథ ఏముందని చిరంజీవి అడగగా ఆ కథ ప్రక్కకు పెట్టాననీ , ఒక సరికొత్త కథ తో మిమ్మల్ని కలుస్తాననీ పూరి చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: