‘ఆర్ఆర్ఆర్’ జపాన్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

RRR Movie To Release in Japan Soon,RRR Telugu Movie Gets Ready For Japan Release,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Releasing in Japan,RRR Movie in Japan,Jr Ntr and Ramcharan,SS Rajamouli RRR Movie Ready To Release in Japan, RRR Telugu Movie Ready To Release in Japan,Jr NTR and Ramcharan Blockbuster Movie RRR Releasing in Japan,Jr NTR and Ramcharan latest Movie RRR Ready To Release in Japan, SS Rajamouli,Director Rajamouli Latest Blockbuster Movie RRR Ready To Release in Japan

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమా రిలీజ్ అయి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి సినిమా అంటే కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎలా ఎదురుచూస్తారో తెలియంది కాదు. ఇక కాస్త లేట్ అయినా కూడా రాజమౌళి ప్రేక్షకులకు ఎలాంటి ఎలిమెంట్స్ కావాలో అవన్నీ సినిమాలో ఉండేలా చిత్రీకరిస్తుంటాడు. అందుకే ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుంటాయి. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా కూాడా అలాంటి రికార్డులే క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా రాజమౌళి సినిమాలకు ఇతర దేశాల్లో కూడా మంచి డిమాండే ఉంటుందన్న సంగతి తెలిసిందే. బాహుబలి ఇతర దేశాల్లో కూడా ఎంత్ క్రేజ్ ను సొంతం చేసుకుందో తెలుసు. కొన్ని దేశాల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు కూడా. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ వంతు వచ్చింది. ఈసినిమాను జపాన్ లో రిలీజ్ చేయనున్నారు. ఇక తాజాగా జపాన్ లో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో డేట్ ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. అక్టోబర్ 21న ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

 

View this post on Instagram

 

A post shared by RRR Movie (@rrrmovie)

ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ నటించారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − four =