టాలీవుడ్ దమ్ కా దాస్ విశ్వక్ సేన్ తిరుమలను సందర్శించారు. ఆయన హీరోగా నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా త్వరలో విడుదలకానుంది. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సులు తీసుకునేందుకు ఆయన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ టీమ్‌తో కలిసి తిరుమలకు విచ్చేసారు. సోమవారం ఉదయం తిరుమల చేరుకున్న విశ్వక్ సేన్, యూనిట్ సభ్యులకు ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం విశ్వక్ సేన్ మరియు చిత్రయూనిట్‌కి అర్చకులు రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందించారు. ఆ తర్వాత స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా విశ్వక్ సేన్ హీరోగా విలేజ్ నేపథ్యంలో రూపొందిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వస్తోంది.
Mass Ka Das @VishwakSenActor visited Tirumala and sought the blessings of Lord Venkateswara Swamy ahead of the release of #GangsOfGodavari ✨#GOGTrailer ICYMI ▶️ https://t.co/Y4YcSUmTFJ#GOG WW grand release at theatres near you on MAY 31st! 🌊🔥#GOGOnMay31st 💥 pic.twitter.com/RHTkTSGT1A
— Sithara Entertainments (@SitharaEnts) May 27, 2024
ఇక ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీలో విశ్వక్ లంకల రత్నగా కనిపించనుండగా.. ఆయన సరసన నేహా శెట్టి హీరోయిన్గా నటించింది. అలాగే అంజలి,సాయి కుమార్, గోపరాజు రమణ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. కాగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై సూర్య దేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం మే 31న రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























