రీజనబుల్ ధరకే ‘విక్రమ్’ సినిమా టికెట్లు..!

Vikram Movie Tickets Rate Reduced,Kamal Haasan’s Vikram Ticket Prices Reduced In AP And Telangana,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vikram,Vikram Movie,Vikram Telugu Movie,Vikram Telugu Version Movie,Vikram Movie Updates,Vikram movie Latest Updates,Vikram movie Ticket Price, Vikram Movie Ticket Price Will Be Reasonable,Vikram Movie Ticket will be at Reasonable Price,Vikram Movie Ticket Price Available for Reasonable Price, Kamal Haasan Vikram Movie Updates,Vikram movie Latest updates,Kamal Haasan upcoming Movie Vikram movie Tickets Updates,Vikram Review And Rating,Vikram Premiere Show Review,Vikram Pre Review,Vikram Movie Pre Review,Vikram (film),Vikram Movie (2022), Vikram Movie Plus Points,Vikram FDFS Review,Vikram Movie First Review,Vikram First Review Out,Vikram Movie Public Talk,Vikram Movie Public Response, Vikram Movie Highlights,Vikram Movie Story,Vikram,Vikram Movie,Vikram Telugu Movie,Vikram (2022),Vikram Movie Review (2022),Vikram Movie Updates, Vikram Movie Latest News and Updates,Vikram Movie Latest News,Vikram Telugu Movie Latest News,Vikram Telugu Movie Live Updates,Vikram Highlights, Vikram Public Response,Kamal Haasan,Vijay Sethupathi,Fahadh Faasil,Lokesh Kanagaraj,Anirudh Ravichander

కరోనా తరువాత సినీ పరిశ్రమల్లో చాలా మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అందులోనూ ఓటీటీలు రాజ్యమేలుతున్న ఈరోజుల్లో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటం కూడా కష్టమైపోయింది. ఇప్పుడిప్పుడే మళ్లీ పాతరోజులొచ్చి సినిమాలు చూసేందుకు జనాలు థియేటర్ల దగ్గరకు వెళుతున్నారు. మరోవైపు సినిమా టికెట్ల పెంపు కూడా సామాన్య ప్రేక్షకుడికి కాస్త భారంగానే మారాయి. పెద్ద పెద్ద సినిమాలు టికెట్ రేట్లను పెంచుకుంటున్నా పాన్ ఇండియా సినిమాలు కాబట్టి చూసేస్తున్నారు. అయితే రిపీటెడ్ ఆడియన్స్ మాత్రం తగ్గిపోతున్నారు. అయితే కొన్నిసినిమాలు మాత్రం ఆడియన్స్ కు అందుబాటులో ఉండాలని టికెట్ రేట్లలను చాలా తక్కువ ధరలకే అమ్ముతున్నారు. ఇప్పటికే ఎఫ్ 3 సినిమా టికెట్లను చాలా తక్కువకు అందుబాటులో ఉంచారు. మేజర్ సినిమాకు కూడా ఏపీ మరియు తెలంగాణలోమల్టీ ప్లెక్స్ లలో 200, 177 రూపాయల టికెట్స్ తో రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు కూడా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఇదే బాటలో మరో సినిమా కూడా టికెట్ రేట్లను రీజనబుల్ ధరకే అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది. ఆసినిమా మరేదో కాదు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా. విక్రమ్ సినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. జూన్ 3వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా టికెట్ రేట్లను ఫిక్స్ చేస్తూ చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మల్టీ ప్లెక్స్ లలో 200, 177 రూపాయలకు తక్కువ ధరకే అందుబాటులో ఉంచామని తెలిపారు.

కాగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలలో నటించగా.. ఈ సినిమాలో మరో స్టార్ హీరో సూర్య పవర్ ఫుల్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈసినిమాలో కాళిదాస్ జయరాం, నరేన్, ఆంటోనీ వర్గీస్, అర్జున్ దాస్, శివానీ నారాయణన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తుండగా.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు..

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.