‘మేజర్’ యాంథమ్ జనగణమన సాంగ్ రిలీజ్..!

Janagana Mana song from Major Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Major,Major Movie,Major Telugu Movie,Major Movie Song,Major Song Out Now,Major Movie Song Janagana Mana Song Out Now,Major Movie Song Updates,Adivi Sesh Major Movie SOng Out Now, janagana Mana Song Released From Major Movie,Adivi Sesh Janagana Mana Movie Song Released,Adivi Sesh Upcoming movie Major Movie Song Janagana Mana Song Released

విభిన్న కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అడవి శేషు. క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలతో మంచి విజయాలను అందుకున్న అడివి శేష్ ఇప్పుడు “మేజర్” గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భారీ అంచనాల మధ్య ఈసినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ ను బాగానే చేశారు మేకర్స్. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సౌత్ తో పాటు నార్త్ లో కూడా మంచి బజ్ క్రియేట్ చేశారు. అంతేకాదు పలు నగరాల్లో ఇప్పటికే ప్రివ్యూలు నిర్వహించగా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మరోవైపు ఇప్పటికే ఈసినిమా నుండి పాటలు, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయగా అవి అందరినీ ఆకట్టుకొని సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక తాజాగా ఈసినిమా నుండి మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా ఈసినిమా నుండి యాంథమ్ అంటూ జనగణమన సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం. జయహే.. జయహో ఎగిరే కలలో.. రగిలే రవివో.. అలిసే బరిలో అంటూ సాగే ఈపాటలో మేజర్ చిన్ననాటి నుండి వివిధ దశలను చూపించారు. ఈపాటకు రాజీవ్ భరద్వాజ్ సాహిత్యాన్ని అందించగా.. టోజన్ టోబి ఈపాటను ఆలపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శోభితా ధూళిపాళ్లతో పాటు స‌యీ మంజ్రేక‌ర్ కూడా మరో కథానాయికగా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్‌ హోమ్ బేనర్‌ జీఎంబీ ప్రొడక్షన్స్‌ సోనీ పిక్చర్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 17 =