“F 3 “మూవీ పై బాలకృష్ణ ప్రశంసలు

Balakrishna is all praises for F3 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Balakrishna,Hero Balakrishna,Balakrishna Latest Updates,Balakrishna Latest News,Balakrishna About F3 movie,Balakrishna Prasise F3 Movie,Balakrishna Love F3 Movie, Balakrishna Praises Vnekatesh F3 Movie,F3 Movie Latest Updates,F3 Movie Collections Updates,F3 Movie Collections,F3 Movie Box Office Collections F3 Multistarrer Movie, Venaktesh and Varun Tej Movie F3 Blockbuster Hit,F3 Movie Overseas Collections,Balakrishna upcoming Movies,Balakrishna New Movie Updates,Balakrishna latest News

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ 27 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్, సునీల్ కీలక పాత్రలలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.హీరో వెంకటేష్ తన కామెడీ టైమింగ్‌తో మరోసారి ఈ సినిమాకే హైలెట్ గా నిలిచారు. ఫ్యామిలీ సీన్స్, మనీ ఫ్రస్ట్రేషన్ సీన్స్ ప్రేక్షకులను అలరించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కామెడీ ఎంటర్ టైనర్ మూవీస్ కు ప్రేక్షకాదరణ ఉంటుందని “F 3” మూవీ నిరూపించింది. “F 3” మూవీకి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా “F 3” మూవీ 80 కోట్లకు పైగా వసూళ్ళతో దూసుకుపోతోంది. తాజాగా “F 3” మూవీని నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా వీక్షించారు. ఆయనతో పాటు చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ .. “F 3” మూవీని ఆడియెన్స్ పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారనీ , ఇలాంటి సినిమాతో మళ్లీ ఫ్యామిలీస్‌ను థియేటర్లకు రప్పించిన ఘనత దర్శకుడు అనిల్ రావిపూడికే దక్కిందనీ , ఈ సినిమాలో నటించిన నటీనటులందరూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారనీ చెబుతూ “F 3 “మూవీ టీమ్ పై ప్రశంసలు కురిపించారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 2 =