కల్కి 2898 AD.. బుజ్జి విశేషాలు వివరించిన నాగ్ అశ్విన్

Kalki 2898 AD Director Nag Ashwin Reveals Interesting Facts About Bujji

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ నటులు నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో దీపికా పదుకొణే ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. మరొక హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కీలక పాత్రలో కనిపించనుంది. వైజయంతి మూవీస్‌ పతాకంపై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీ దత్‌ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన గ్లింప్స్, స్పెషల్ వీడియోస్ అన్నీ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. జూన్ 27వ తేదీన ‘కల్కి 2898 AD’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు కస్టమ్-మేడ్ వాహనాన్ని విడుదల చేయడానికి ఒక వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగిన ఈ వేడుకకు డార్లింగ్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ‘బుజ్జి’ని ప్రపంచానికి పరిచయం చేయడానికి దాదాపు 1 నిమిషం నిడివి గల టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా కస్టమ్ మేడ్ వెహికల్ బుజ్జి బిల్డింగ్ వెనుక ఉన్న టీమ్‌ని దర్శకుడు పరిచయం చేశాడు. ఈ సందర్భంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. “బుజ్జి పేరు చిన్నగా అనిపించినా అది మాకు చాలా ప్రత్యేకమైనది. కల్కి లాంటి చిత్రం తీయడం చాలా కష్టమైన పని. నేను ఇంజనీరింగ్ చేయలేదు. నేను సహాయం కోసం ఆనంద్ మహీంద్రా గారికి ట్వీట్ చేసాను. ఆయన వెంటనే స్పందించి తన బృందాన్ని యాక్టివేట్ చేశారు” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “అనంతరం వారు మమ్మల్ని కోయంబత్తూర్‌లోని జయం మోటార్స్‌కు తీసుకువెళ్లారు. ఇది చాలా ప్రయోగాత్మక రేసింగ్ కార్-బిల్డింగ్ కంపెనీ. ఇలాంటి ఫీచర్లతో కూడిన కారును తయారు చేసేందుకు భారీ పరిశోధన అవసరం. తయారీ తర్వాత చూస్తే ఆ కారు భారీగా ఉంది. మేము దానిని కల్కి మరియు భైరవ కోసం అంచెలంచెలుగా మార్పులు సూచించాం. మొత్తానికి వారు మేము కోరుకున్న విధంగా రూపొందించి ఇచ్చారు. అందుకు మహీంద్రా టీమ్ మొత్తానికి, జయం మోటార్స్ టీమ్ మరియు కల్కి టీమ్‌కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు నాగ్ అశ్విన్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.