తమిళ్ తో పాటు తెలుగులో తన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి. మొదటినుండి విభిన్నమైన కథలు .. విలక్షణమైన పాత్రలను చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక వైపున హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు పాత్ర ప్రధానమైన సినిమాలు అప్పుడప్పుడు విలన్ పాత్రలు కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవలే గుడ్ లక్ సఖి సినిమాతో మెప్పించిన ఆది.. ఇప్పుడ `క్లాప్` అనే మరో సినిమాతో వస్తున్నాడు. పృథ్వీ ఆదిత్య దర్శకత్వంలో అథ్లెటిక్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. కరోనా వల్ల ఈసినిమా రిలీజ్ కు కూడా చాలా బ్రేక్ పడింది. అంతేకాదు ప్రమోషన్స్ కూడా ఆగిపోయాయి. ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి కూడా చాలా కాలం అయిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా గురించి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం పరిస్థితులు బాలేని నేపథ్యంలో ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ లో ఈసినిమా రిలీజ్ అవుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు. త్వరలోనే డేట్ కూడా ఫిక్స్ చేయనున్నారు.
Will Vishnu’s courage and conviction be enough for him to achieve his dream? #CLAP , an inspiring sports drama, streaming soon in Telugu & Tamil, on #SonyLIV@prithivifilmist @AadhiOfficial @aakanksha_s30 @KurupKrisha @actorbrahmaji #nassar @prakashraaj pic.twitter.com/TepK0by9U4
— SonyLIV (@SonyLIV) February 9, 2022
ఆది పినిశెట్టి సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికగా నటిస్తుండగా..ఇంకా ఈ సినిమాలో కృష్ణ కురూప్ , ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మాజీ, రాందాసు తదితరులు నటిస్తున్నారు. ఐబీ కార్తికేయన్ సమర్పణలో శ్రీ షిరిడీసాయి మూవీస్, బిగ్ ప్రింట్ పిక్చర్స్, సర్వన్త్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లపై రామాంజనేయులు జవ్వాజి, యం .రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: