కరోనా థర్ట్ వేవ్ వల్ల మళ్లీ సినిమా రిలీజ్ లకు తలనొప్పులు వచ్చిపడ్డాయి. వరుసగా సినిమాలు పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలన్నీ ఒక్కొక్కటిగా రేసు నుంచి తప్పుకుంటున్నాయి. ఇప్పుడు ఈలిస్ట్ లో మరో పెద్ద సినిమా కూడా చేరిపోయింది. మొత్తానికి అనుకున్నట్టే వాలిమై సినిమా కూడా పొంగల్ రేస్ నుండి తప్పుకుంది. ఇప్పటికే పెద్ద పెద్ద సినిమాలు అన్నీ పొంగల్ రేస్ నుండి ఓట్ అవ్వగా కనీసం వాలిమై సినిమా అయినా రిలీజ్ అవుతుందేమో అని సినీ లవర్స్ ఆశగా ఉన్నారు. కానీ ఇప్పుడు వారిని నిరాశ పరుస్తూ ఈసినిమా కూడా వాయిదా వేశారు. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మా డ్రీమ్ ప్రాజెక్ట్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశాం.. అయితే ఈసినిమాను అందరూ థియేటర్లలో చూడాలన్ని మాకోరిక.. కానీ కరోనా ప్రభావం పెరగడం.. కేసులు పెరుగుతుండటంతో అధికారుల నిబంధనలు మేరకు ఈసినిమా రిలీజ్ ను వాయిదా వేయాలని అనుకుంటున్నాం.. ప్రేక్షకుల ఆరోగ్యం కూడా మా బాధ్యత.. అందుకే పరిస్థితులు కాస్త సాధారణ పరిస్థితి వచ్చేంతవరకూ రిలీజ్ చేయాలని అనుకోవడం లేదు.. అందరూ మాస్క్ ధరించండి.. సురక్షితంగా ఉండండి అంటూ చిత్రయూనిట్ తెలిపింది.
కాగా హెచ్. వినోత్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. బాలీవుడ్ నటి హుమా ఖురేషి హీరోయిన్ గా నటిస్తుండగా… కార్తికేయ విలన్‌గా చేస్తున్నాడు. బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌లో ఈసినిమాను నిర్మిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: