బ్లాక్ బస్టర్ “క్రాక్ ” మూవీ తో ప్రేక్షకులను అలరించిన మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ కామెడీ ”ఖిలాడి“మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు. యాక్షన్ సీన్స్ హైలైట్ గా రూపొందుతున్న ”ఖిలాడి “మూవీ లో మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. ఈ మూవీ తో పాటు రవితేజ , శరత్ మండవ దర్శకత్వంలో వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రామారావు ఆన్ డ్యూటీ “మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. ఈ రెండు మూవీస్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో రవితేజ “#RT 69 ” మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ హీరోగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ “#RT 69 ” తెరకెక్కనుంది. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కనున్న ఈ మూవీ అక్టోబర్ 4వ తేదీ ప్రారంభం కానుందని హీరో రవితేజ ఒక పోస్టర్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. వరస యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీస్ తో హీరో రవితేజ ప్రేక్షకులను అలరించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: