శ్రీకాంత్, లయ హీరో హీరోయిన్స్ గా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మిస్టర్ మిడిల్ క్లాస్. జీకే & సిఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ ని ఈ రోజు లాంచ్ చేశారు. ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి ఈ వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. డైరెక్టర్ కృష్ణారెడ్డి రెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి గారికి థాంక్స్. చాలా రోజుల తర్వాత హీరోగా నా సినిమా టీజర్ లాంచ్కు రావడం ఆనందంగా వుంది. కమలాకర్ గారు ఫోన్ చేసి ఒక మంచి ఎంటర్టైనర్ చేద్దామని చెప్పారు. నేను వెంటనే ఖచ్చితంగా చేద్దామని చెప్పాను. నాగేశ్వర్ రెడ్డి గారు దర్శకుడు అని తెలిసిన తర్వాత నా కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే సినిమా చేసి చాలా రోజులైంది. చాలా కాలం తర్వాత అలాంటి చక్కని సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. సినిమా చేస్తున్నంతసేపూ చాలా ఎంజాయ్ చేశాను. మురళీధర్ గారు అద్భుతమైన టైమింగ్ ఉన్న నటుడు. ఆయన ఈ సినిమాలో నా తండ్రి పాత్రలో నటించారు.
లయతో నేను చాలా మంచి సినిమాలు చేశాను. ‘స్వరాభిషేకం’ సమయంలో ఎలా ఉన్నారో, ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఆమెతో మళ్లీ కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. సాయి కార్తీక్ చాలా మంచి సంగీతం అందించారు. సునీల్, వెన్నెల కిషోర్, రఘుబాబు, అలీ వంటి అద్భుతమైన నటీనటులతో చాలా రోజుల తర్వాత కలిసి పనిచేయడం ఆనందాన్ని ఇచ్చింది. చందు, జీకే ఈ చిత్రాన్ని చక్కగా నిర్మించారు. రాజేంద్ర ప్రసాద్ గారితో నేను ఎన్నో సినిమాలు చేశాను. మళ్లీ ఆయనతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రను ఆయన ఎంతో నిజాయితీగా, అంకితభావంతో పోషించారు. డైమండ్ రత్నబాబు గారు చాలా చక్కని సంభాషణలు రాశారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























