తమిళంలో సూపర్ హిట్ అయిన సైకో థ్రిల్లర్ సినిమా రాచ్చసన్ తెలుగులో రాక్షసుడు పేరుతో రీమేక్ అయి ఇక్కడ కూడా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే కదా. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హరోగా నటించగా.. ఈసినిమాతోనే మొదటిసారి సూపర్ హిట్ అందుకున్నాడు.అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈసినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా దీనికి సీక్వెల్ ప్లాన్ చేశాడు డైరెక్టర్. అంతేకాదు టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు. టైటిల్ పోస్టర్ లో ఓ సైకో చేతిలో గొడ్డలి పట్టుకుని శవాన్ని మోసుకెళుతుండగా. తన వెనకాల చైన్‌కు రక్తంతో తడిసిన కత్తి వేలాడుతుండడం చూడొచ్చు. దీంతో ఈసారి మరింత థ్రిల్లింగ్ గా ఈసినిమా రాబోతుందని అర్థమవుతుందని. అంతేకాదు షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తామని తెలిపారు.
Hold your breath.. Going to be More Thrilling 😉#Rakshasudu2 is On!! 👍@idhavish #KoneruSatyaNarayana@SrikanthVissa @sagar_singer@GhibranOfficial #VenkatCDileep
Shoot Begins Soon pic.twitter.com/EX89zyiv8b
— Ramesh Varma (@DirRameshVarma) July 13, 2021
ఇక ఈసీక్వెల్ ను కూడా రాక్షసుడు సినిమాను తెరకెక్కించిన హవీష్ ప్రొడక్షన్స్ పతాకంపై ‘ఏ స్టూడియోస్’ అధినేత కోనేరు సత్యనారాయణ ‘రాక్షసుడు 2’ సినిమాను నిర్మించనున్నాడు. జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్ విస్సా, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నాడు. అయితే ఇందులో మరోసారి హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తాడా? లేదా వేరే స్టార్ హీరో నటిస్తాడా? అన్నది తెలియాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: