`క్రాక్` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం రమేష్‌వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. సూపర్ స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాకు కోరనా బ్రేక్ వేసింది. ఇక మళ్లీ షూటింగ్ ను రీస్టార్ట్ చేశారు. కొన్ని రోజులు ఇక్కడే షూటింగ్ జరుపుకొని ఆ తరువాత దుబాయ్ లో షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాతో పాటు శరత్ మండవ దర్శకత్వంలో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ రూపొందుతోన్న విషయం తెలిసిందే..రియల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా ఒక యూనిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రవితేజను ఇంతవరకూ చూడని ఒక సరికొత్త పాత్రలో చూపించబోతున్నారు దర్శకుడు శరత్ మండవ. రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టనున్నాడు. జులై 1 నుండి హైదరాబాద్‌లో ఈసినిమా ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని అల్యుమినియం ఫ్యాక్టరీలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో టీమ్ అందరూ పాల్గొననున్నారు.
కాగా ఎస్ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇక ఈసినిమాకు ఎక్కువ టైమ్ తీసుకోకుండా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని చూస్తున్నారట.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: