మెగాస్టార్ చిరు లిస్ట్ లో ఇప్పుడు పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ఎలాగూ చివరి దశకు వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ లేకపోతే ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అయిపోయి ఉండేది. గత ఏడాది.. ఈఏడాది కరోనా వల్ల ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోలేకపోయింది. కనీసం కరోనా సెకండ్ వేవ్ లేకపోతే షూటింగ్ అయినా పూర్తి చేసుకొని ఉండేది. కానీ ఇంకా పది ఇరవై రోజుల షూటింగ్ పెండింగ్ లో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఆచార్య అనంతరం వెంటనే లూసిఫర్ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు చిరు. అయితే ఇటీవల కొన్ని ఊహించని రూమర్స్ వైరల్ అయ్యాయి. మోహన్ రాజా ఈసినిమా నుండి డ్రాప్ అయినట్లు గాసిప్స్ బాగానే వచ్చాయి. ఇక అందులో ఎలాంటి నిజం లేదని ఇప్పటికే క్లారిటీ రాగా ఇప్పుడు మరోసారి క్లారిటీ ఇచ్చారు చిరు. నేడు మోహన్ రాజా పుట్టినరోజు కావడంతో ఆయనకు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ చెప్పి రూమర్లకు చెక్ పెట్టారు.
Birthday wishes to Director @jayam_mohanraja Garu pic.twitter.com/VmxvdWEaLe
— Konidela Pro Company (@KonidelaPro) May 30, 2021
ఇదిలాఉండగా ఈసినిమా కోసం చిరు జులై నుండి డేట్సు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. జులై నుండి మొదలుపెట్టి పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఈసినిమాను కూడా వీలైంత వరకూ త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారట చిరు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: