వంశీ పైడిపల్లి-విజయ్ కాంబినేషన్ లో సినిమా పక్కా ..!

New Movie To Come Up With Director Vamsi Paidipally and Thalapathy Vijay Combination,Telugu Filmnagar,Thalapathy Vijay To Join Hands With Director Vamsi Paidipally,Thalapathy 66,Vijay To Team Up With Director Vamsi Paidipally,Vijay And Vamsi Paidipally Team Up For Thalapathy 66,Thalapathy Vijay's 1st Telugu Film,Vamsi Paidipally And Vijay Combination,Vamsi Paidipally And Thalapathy Vijay,Director Vamsi Paidipally,Vamsi Paidipally,Vamsi Paidipally Movies,Vamsi Paidipally New Movie,Thalapathy Vijay,Vijay,Actor Vijay,Hero Vijay,Thalapathy Vijay Movies,Thalapathy Vijay New Movie,Thalapathy Vijay Latest Movie,Thalapathy Vijay Latest News,Vamshi Confirms His Project With Thalapathy Vijay And Dil Raju,Vamshi Paidipally Confirms His Next With Thalapathy Vijay,Dil Raju,Vijay And Vamsi Paidipally Movie,Vijay And Vamsi Paidipally Movie Updates,Thalapathy Vijay To Team Up With Vamshi Paidipally,Thalapathy 66 Movie Updates,Thalapathy 66 Movie,Thalapathy 66 Film News,Vamshi Paidipally To Direct Thalapathy Vijay,#Thalapathy66

తమిళ్ స్టార్ హీరో విజయ్ కు తెలుగులో ఎంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే విజయ్ మాత్రం ఇంతవరకూ స్ట్రయిట్ తెలుగు ఫిలిం చేయలేదు. ఈనేపథ్యంలో గత కొద్దిరోజులుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా తెలుగులో సినిమా రాబోతుందని వార్తలు జోరుగా వినిపించిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇందులో ఎంత నిజముందో అన్నది మాత్రం తెలియలేదు. ఆతరువాత దీనిపై ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో రూమర్స్ అనుకొని సైలెంట్ అయిపోయారు అందరూ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తాజాగా విజయ్‌తో తన సినిమా ఉండబోతోందన్న క్లారిటీవచ్చేసింది. క్లారిటీ ఇచ్చింది కూడాఎవరో కాదు వంశీపైడిపల్లి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వంశీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉండబోతుందని.. లాక్‌డౌన్‌ పూర్తైన తర్వాత అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ ప్రకటిస్తామని తెలిపారు.అంతేకాదు ఈ ప్రాజెక్ట్‌ను దిల్ రాజు నిర్మించబోతున్నట్టు వంశీ పైడిపల్లి తెలిపాడు.

మరి ఇళయదళపతి అందులోనూ వంశీ పైడిపల్లి డైరెక్టర్, దిల్ రాజు నిర్మాతగా కాబట్టి ఖచ్చితంగా భారీ బడ్జెట్ సినిమానే అయి ఉంటుంది. ప్రస్తుతం విజయ్‌ నెల్సన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్తయిన వెంటనే వంశీ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారట. మొత్తానికి ఇన్నేళ్లకు విజయ్ తెలుగులో స్ట్రయిట్ ఫిలింతో వస్తున్నాడు. మరి ఇప్పటివరకూ డబ్బింగ్ సినిమాలతోనే ఇక్కడ సక్సెస్ కొట్టిన విజయ్ కు తెలుగు సినిమా ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 1 =