అమెరికాలో హాఫ్ మిలియన్ మార్క్ క్రాస్ చేసిన పెద్ది

Peddi Crosses Half-Million Mark at the USA Box Office

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ . జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతుండగా.. ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద అప్పుడే చరణ్ మాస్ ర్యాంపేజ్ మొదలైపోయింది. సినిమా విడుదలవడానికి ఇంకా కొన్ని రోజులు సమయం ఉండగానే, నార్త్ అమెరికా ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘పెద్ది’ హాఫ్ మిలియన్ డాలర్ల ($500K మార్క్) మైలురాయిని దాటి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అంతర్జాతీయంగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్‌పై ఓవర్సీస్ మార్కెట్‌లో అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్స్ నిరూపిస్తున్నాయి. కేవలం ప్రీమియర్ల కోసమే అమెరికాలో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం మొదటి రోజే ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్ల క్లబ్‌ను ఈజీగా దాటేసేలా ఉంది. ఇప్పటికే యూఎస్ఏ ప్రింట్స్ పంపించేందుకు ఏర్పాట్లు కూడా ముగిశాయి.

రామ్ చరణ్ ఈ సినిమాకు సంబంధించిన తన డబ్బింగ్ పార్ట్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. ఈ చిత్రంలో ఆయన ఒక విలక్షణమైన, పవర్‌ఫుల్ మాస్ రోల్‌లో కనిపించబోతున్నారు.ఇందులో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా .. శ్రుతి హాసన్ ఒక స్పెషల్ సాంగ్ సీక్వెన్స్‌లో మెరవనుంది. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి.వృద్ధి సినిమాస్ ఈసినిమాను నిర్మించింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.