గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దిగ్గజ దర్శకుడు సుకుమార్ కలయికలో రూపుదిద్దుకోనున్న మోస్ట్ అవేటెడ్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ #RC17. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ ఆకాశాన్ని తాకే అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం హైదరాబాద్‌లోని రామనాయుడు స్టూడియోస్‌లో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
అయితే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు మరియు ప్రధాన సాంకేతిక నిపుణుల ఎంపిక ఇంకా పూర్తిగా ఖరారు కావలసి ఉంది. ముఖ్యంగా కథానాయిక పాత్ర విషయంలో సుకుమార్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.ఇందుకోసం కొత్త అమ్మాయిని ఎంపిక చేసే ఛాన్స్ ఉందని సమాచారం.
కాగా, గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ‘ఆకాశంలో ఒక తార’ ఫేమ్ సాత్విక వీరవల్లి ఈ సినిమాలో కథానాయికగా ఫిక్స్ అయిందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టమవుతోంది. బయట ప్రచారంలో ఉన్న ఆ వార్తలన్నీ కేవలం రూమర్లు మాత్రమే.
మైత్రీ మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ గ్రాండ్ లాంచ్ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























