అగ్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న యూత్‌ఫుల్ రోమాంటిక్ డ్రామా ‘రోమాంచకం’. ‘మేమ్ ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ జంటగా వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం నుంచి మొదటి పాట ‘రాధా రమణ’ను తాజాగా విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందమైన భావోద్వేగాలు, ప్రేమతో సాగే ఈ మధురమైన లవ్ మెలోడీకి సంగీత దర్శకుడు వాసుకి వైభవ్ స్వయంగా బాణీలు అందించి ఆలపించారు. ఆస్కార్ విజేత, ప్రముఖ సినీ రచయిత చంద్రబోస్ అందించిన సాహిత్యం పాటలోని ప్రణయ భావాలకు మరింత అందాన్ని తెచ్చిపెట్టింది. సుమంత్ ప్రభాస్, అనంతికల మధ్య సాగే రొమాంటిక్ సన్నివేశాలతో రూపుదిద్దుకున్న ఈ పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
టీ-సిరీస్ సౌత్ ద్వారా విడుదలైన ఈ ఫస్ట్ సింగిల్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























