టాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ మరియు ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త వినోదాత్మక చిత్రం “పళ్లబురుసు”. ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఒక స్వచ్ఛమైన, వినోదాత్మక కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఉదయ్ చౌహాన్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.బలగం ఫేమ సుధాకర్ రెడ్డి మరియు మురళీధర్ గౌడ్ ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా నటిస్తున్నారు.
పల్లెటూరి వాతావరణం, మట్టి మనుషుల జీవన విధానం చుట్టూ తిరిగే ఒక ఆసక్తికరమైన రూటెడ్ కామెడీ డ్రామా ఇది. ఒక ‘పళ్లబురుసు’ (టూత్‌బ్రష్) చుట్టూ ఈ కథ నడుస్తుందని మేకర్స్ గ్లింప్స్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
ఈ చిత్రం ఆగస్టు 14, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ‘బలగం’, ‘పరేషాన్’ వంటి చిత్రాల తరహాలోనే ఇది కూడా అచ్చమైన తెలంగాణ సంస్కృతిని, హాస్యాన్ని ప్రతిబింబించేలా ఉండబోతోంది. మొత్తానికి టైటిల్ ,గ్లింప్స్ తోనే ఈసినిమా మంచి హైప్ తెచ్చుకుంటుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























