‘చావు కబురు చల్లగా’ లో అనసూయ స్పెషల్ సాంగ్

Star Anchor Anasuya To Feature In A Special Song In Chaavu Kaburu Challaga Movie,Chaavu Kaburu Challaga,Chaavu Kaburu Challaga Movie,Chaavu Kaburu Challaga Telugu Movie,Chaavu Kaburu Challaga Movie Latest News,Chaavu Kaburu Challaga Latest Updates,Anchor Anasuya,Karthikeya Gummakonda,Actor Karthikeya Gummakonda,Karthikeya Gummakonda Chaavu Kaburu Challaga,Anasuya Dance Number In Chaavu Kaburu Challaga,Lavanya Tripathi,Anasuya Chaavu Kaburu Challaga Movie Stills,Anasuya Special Song In Chaavu Kaburu Challaga,Anasuya In Chaavu Kaburu Challaga,Anchor Anasuya To Feature Special Song In Chaavu Kaburu Challaga,Anasuya Bharadwaj Special Dance Number In Chaavu Kaburu Challaga,Anchor Anasuya Feature In A Special Song,Anchor Anasuya Latest News,Anchor Anasuya Special Song,#CKC

ప్రస్తుతం కార్తికేయ కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో ‘చావు కబురు చల్లగా’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజుగా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ‘బ‌స్తి బాల‌రాజు’ ఫ‌స్ట్ లుక్, ఇంట్ర… ఆ త‌రువాత టీజ‌ర్ గ్లిమ్ప్స్, మైనేమ్ ఈజ్ రాజు పాట‌ను విడుదల చెయ్యగా మంచి స్పంద‌న ల‌భించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నట్టు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఇప్పుడు అధికారికంగా చిత్ర యూనిట్ అనసూయ ఐటమ్ సాంగ్ ను కన్ ఫామ్ చేసింది. స్పెషల్ సాంగ్ లో అనసూయ నటిస్తున్నట్టు గీతా ఆర్ట్స్ 2 సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ పాట‌ను కూడా త్వరలో విడుద‌ల చేయనున్నట్టు తెలుస్తుంది.

కాగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో మురళీ శర్మ, ఆమని, శ్రీకాంత్ అయ్యంగర్, మహేష్,భద్రం తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈసినిమాను నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి కరమ్ చావ్లా సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. మార్చి 19 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

బుల్లితెర పైనే కాదు వెండితెరపై కూడా అనసూయకు లక్ బాగానే కలిసొచ్చింది. క్షణం సినిమాలో విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించిన అనసూయ.. ఆతర్వాత వచ్చిన రంగస్థలంలోని రంగమత్త పాత్ర మాత్రం సినీ కెరీర్ టర్నింగ్ పాయింట్ అయింది. ఇప్పుడు పలు సినిమాల్లో పలు కీలక పాత్రల్లో అనసూయకు అవకాశాలు దక్కుతున్నాయి. ఇక సినిమాల్లో అవకాశాలు వస్తున్నా, ఆమె బుల్లితెరను వదిలేయకుండా కెరియర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటోంది. తనకి నచ్చిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటూ వెళుతోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here