కొరియన్ కనకరాజు స్పెషల్ సాంగ్ లో మెరవనున్న దక్ష నాగర్కర్ .. సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

Korean Kanakaraju Special Song Featuring Daksha Nagarkar Gets a Release Date

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’తో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది. టైటిల్ గ్లింప్స్ , ఫస్ట్ సింగిల్ ‘కంసంనిద’, టీజర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ‘రాసగుమ్మడి’ ఫుల్ లిరికల్ సాంగ్‌ను జూలై 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వరుణ్ తేజ్, హీరోయిన్ దక్షా నాగర్కర్ కలర్ ఫుల్ లుక్‌తో విడుదలైన సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్ మాస్-ఫెస్టివ్ సాంగ్‌ వైబ్ ని క్రియేట్ చేస్తోంది.

కొరియన్ కనకరాజు లో దక్షా నాగర్కర్‌ స్పెషల్ సాంగ్ చేస్తోంది. వరుణ్ తేజ్, దక్షా నాగర్కర్‌పై చిత్రీకరించిన రాసగుమ్మడి సాంగ్ కలర్‌ఫుల్ రాయలసీమ జాతర నేపథ్యంలో తెరకెక్కిన మాస్ డ్యాన్స్ నంబర్‌గా ఉండబోతోంది.

పోస్టర్‌లో ఇద్దరి ఎనర్జిటిక్ లుక్స్, ఫెస్టివ్ వైబ్స్ పాటపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. థమన్ సంగీతం అందించిన ఈ పాట మరో చార్ట్‌బస్టర్‌గా కానుంది.ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, కమెడియన్ సత్య కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రంలో అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందించగా, మనోజ్ రెడ్డి కటసాని డీవోపీగా పని చేస్తున్నారు.సరికొత్త కాన్సెప్ట్, ఆకట్టుకునే విజువల్స్, కమర్షియల్ ట్రీట్‌తో ఈ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.