భారీ రన్ టైంతో రానున్న చెన్నై లవ్ స్టోరీ

Chennai Love Story Comes with a Massive Runtime

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం, మ్యాడ్ ఫేమ్ శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ’. ‘కలర్ ఫోటో’, ‘బేబీ’ వంటి కల్ట్ క్లాసిక్స్‌ను అందించిన ప్రముఖ నిర్మాతలు ఎస్‌కేఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న క్రమంలో, తాజాగా తన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘U/A’ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన రన్‌టైమ్ ప్రస్తుతం ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా నిడివి ఏకంగా 2 గంటల 59 నిమిషాలు.

ఈ మధ్యకాలంలో లవ్ స్టోరీ సినిమాలకు ఇంత సుదీర్ఘమైన రన్‌టైమ్ ఉండటం చాలా అరుదు. అయితే కథలోని గాఢమైన భావోద్వేగాలు, లీడ్ పెయిర్ కిరణ్ అబ్బవరం-గౌరి ప్రియల మధ్య వచ్చే ఇంటెన్స్ సన్నివేశాలు ప్రేక్షకులను చివరివరకు లీనం చేస్తాయని మేకర్స్ ధీమాగా ఉన్నారు.ట్రైలర్ సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

మ్యూజిక్ బ్రహ్మ మణిశర్మ అందించిన స్వరాలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవనున్నాయి. జులై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.