కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

జన నాయకుడు సెన్సార్ వివాదంపై స్పందించిన నిర్మాత కేవీఎన్

Producer KVN Responds to the Jana Nayakudu Censor Controversy

జన నాయకుడు సెన్సార్ వివాదంపై స్పందించిన నిర్మాత కేవీఎన్

Producer KVN Responds to the Jana Nayakudu Censor Controversy

Producer KVN Responds to the Jana Nayakudu Censor Controversy

తమిళనాడు ముఖ్యమంత్రి , దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' రేపు విడుదలకానుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా జన నాయగన్ నిర్మాత కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కే నారాయణ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈ సినిమాకి ఎదురైన సెన్సార్ సవాళ్లు మరియు జాప్యంపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

సెన్సార్ బోర్డు సూచించిన మార్పులపై ఆయన స్పందిస్తూ.. సినిమాలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగానికి మరియు విజయ్ రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) విధానానికి మధ్య ఉన్న ఒక కీలకమైన డైలాగ్‌పై అభ్యంతరం వ్యక్తమైందని వెల్లడించారు. "అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పాటించకపోతే టీవీకే) రాజ్యాంగం వర్తిస్తుంది" అనే తరహాలో ఉన్న ఆ సంభాషణను మార్చాలని సూచించడంతో, చట్టానికి కట్టుబడి తగిన మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా, అంబేడ్కర్ పుస్తక కవర్‌ను మార్చడం, కొన్ని ఆధ్యాత్మిక పదాలను (భగవాన్, రంగనాథర్, ఓం) మ్యూట్ చేయడం సహా దాదాపు 20 సెకన్ల సీన్లను కట్ చేసినట్లు క్లారిటీ ఇచ్చారు.

ఈ సినిమా కథ వెండితెరపై నుంచి నిజ జీవితంలోకి సరిగ్గా సరిపోయే రీల్-టు-రియల్ స్టోరీ అని నిర్మాత అభివర్ణించారు. "మేము ఈ సినిమా ప్రారంభించినప్పుడు ఇది ఈ స్థాయిలో పాలిటిక్స్‌తో ముడిపడుతుందని అనుకోలేదు, నిజ జీవితంలోనూ ఆయన నాయకుడిగా ఎదగడం ఈ చిత్రానికి సరికొత్త అర్థాన్ని తెచ్చింది" అని వ్యాఖ్యానించారు. ఎన్నో ప్రతిబంధకాలను దాటుకుని వస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.తెలుగులో ఈసినిమా జన నాయకుడు గా రేపు గ్రాండ్ గా రిలీజవుతుంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్