కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

జన నాయగన్ పై అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు

Anil Ravipudi Makes Interesting Comments on Jana Nayagan and Bhagavanth Kesari Rights

తమిళనాడు ముఖ్యమంత్రి , దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' రేపు విడుదలకానుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రమోషన్స్ లో భాగమై ఈ సినిమాకు సంబంధించిన రీమేక్ రూమర్స్‌పై బిగ్ క్లారిటీ ఇచ్చారు.

నందమూరి బాలకృష్ణతో తాను తెరకెక్కించిన 'భగవంత్ కేసరి' చిత్రాన్ని విజయ్ చూశారని, ఆ సినిమాలోని ఎమోషన్స్ ఆయనకు ఎంతగానో నచ్చాయని అనిల్ వెల్లడించారు. 'ది గోట్' షూటింగ్ సమయంలో విజయ్ తనను ప్రత్యేకంగా పిలిపించి, సినిమా తీసిన విధానాన్ని ఎంతో ప్రశంసించారని తెలిపారు. ఆ అభినందనలు వినగానే తనకు మాటలు రాలేదని, ఆ క్షణాన్ని ఎప్పటికీ మరచిపోలేనని అనిల్ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే 'భగవంత్ కేసరి' నుంచి కొన్ని కీలక సన్నివేశాల హక్కులను KVN ప్రొడక్షన్స్ అధికారికంగా కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు. అయితే 'జన నాయగన్' కేవలం ఆ పాయింట్ ఆధారంగా రూపుదిద్దుకున్న ఒక కొత్త కథ అని, దర్శకుడు హెచ్. వినోద్ తమ తమిళ నేటివిటీకి తగ్గట్టుగా పూర్తిగా మార్చి సరికొత్తగా తెరకెక్కించారని ఆయన క్లారిటీ ఇచ్చారు. సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ గా కొత్తగా ఉంటుందని తెలిపారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్