స్పిరిట్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి

Sandeep Reddy Reveals the Latest Spirit Update

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్వయంగా వెల్లడించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా జరిగిన ‘తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (TTA) మెగా కన్వెన్షన్‌లో పాల్గొన్న సందీప్ వంగా మాట్లాడుతూ.. ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయిందని స్పష్టం చేశారు. మిగిలిన పార్ట్‌ను కూడా వేగంగా పూర్తి చేసి, ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

ఈ సినిమాలో ప్రభాస్ ఇప్పటివరకు చూడని విభిన్నమైన, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి కథానాయికగా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, సీనియర్ నటి కాంచన ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టీ-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు చైనీస్, జపనీస్, కొరియన్ సహా మొత్తం 9 భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.