సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహేంద్రగిరి వారాహి’ మహేంద్రగిరి నేపథ్యంగా, వారాహి మాత డివైన్ పవర్ చుట్టూ సాగే ఈ కథలో ఎన్నో అంతుచిక్కని సంఘటనలు, రహస్యాలు, మిస్టరీతో ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించబోతుంది. ఈ చిత్రంలో మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హైదరాబాద్‌లోని మూసాపేట శ్రీరాములు థియేటర్‌లో చిత్ర బృందం వారాహి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ కార్యక్రమంలో హీరో సుమంత్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. వారాహి గుప్త నవరాత్రుల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ థియేటర్‌లో తమ్ముడు లెనిన్ సినిమా విజయవంతంగా ప్రదర్శిస్తమౌతుంది. వారాహి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఒక గొప్ప అనుభూతి. దీనికి సహకరించిన మా నిర్మాతలు మధు గారికి, లక్ష్మణ్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అమ్మవారి ఆశీస్సులతో త్వరలోనే మా ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా మీ ముందుకు రాబోతోంది. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి, సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మరో రెండు రోజుల్లో సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం.”
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























