కొత్త సంవత్సరంలో సినీ ఇండస్ట్రీ మరో సీనియర్ నిర్మాతను కోల్పోయింది. తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా ఎన్నో మైలు రాయి లాంటి సినిమాలను నిర్మించిన సీనియర్ నిర్మాత వి.దొరస్వామి రాజు ఈ రోజు కన్నుమూశారు. వయసు రీత్యా వచ్చిన అనారోగ్యం కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో… అనారోగ్యంతో ఆయన బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అక్కినేని నాగేశ్వరరావుతో ‘సీతారామయ్య గారి మనవరాలు’ వంటి బ్లాక్ బస్టర్ మూవీని దొరస్వామి రాజు నిర్మించారు. ఈ చిత్రం జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు నాగార్జునతో ‘కిరాయి దాదా’, ‘ప్రెసిడెంట్ గారి పెళ్లాం’, ‘అన్నమయ్య’ చిత్రాలు వచ్చాయి. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ‘సింహాద్రి’ వంటి బ్లాక్ బస్టర్ మూవీని నిర్మించి సెన్సేషన్ క్రియేట్ చేశారు దొరస్వామి. సినిమాలు నిర్మించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సుమారు 1000 సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు.
వీఎంసీ ప్రొడక్షన్స్, వీఎంసీ పిక్చర్స్, వీఎంసీ ఫిలింస్, వీఎంసీ1 కంపెనీ, వీఎంసీ ఫిలిం డిస్ట్రిబ్యూటర్, వీఎంసీ పిక్చర్ ప్యాలెస్ సంస్థల ద్వారా దొరస్వామి రాజు తెలుగు చిత్ర పరిశ్రమకు తన సేవలు అందించారు. సినీ నిర్మాతగానే కాకుండా రాజకీయాల్లోనూ తన ప్రభావం చూపించారు. చిత్తూరు జిల్లా నగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆర్.చెంగారెడ్డి వంటి ఉద్దండ నాయకునిపై భారీ మెజారిటీతో గెలుపొందారు. అంతేకాదు, టీటీడీ బోర్డ్ మెంబర్‌గా, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్‌గా, డిస్ట్రిబ్యూషన్ కౌన్సెల్ ప్రెసిడెంట్‌గా, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: