తెలుగు తేజం ఎన్టీఆర్ ’25’ వ వర్ధంతి

Remembering The Legendary Actor Senior NTR On His 25th Death Anniversary,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nandamuri Taraka Rama Rao,NTR,Sr NTR,Remembering Nandamuri Taraka Rama Rao,Remembering NTR,Remembering Nandamuri Taraka Rama Rao on His Death Anniversary,Remembering NTR on His Death Anniversary,NTR Death Anniversary,N. T. Rama Rao,Viswa Vikhyatha Nata Sarvabhouma,NT Rama Rao 24th Death Anniversary,Sr NTR Death Anniversary

యుగపురుషుడు.. తెలుగు వాడు తెలుగు ప్రజలందరికీ అన్న.. సాంఘిక, జానపద, చారిత్రక సినిమాలేవైనా.. అతను నటిస్తే ఆ పాత్ర పరిపూర్ణమవుతుంది. తెలుగు సినీ చరిత్రలో సాటిలేని కథానాయకుడిగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. అతనే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు. పౌరాణిక చిత్రాల్లో అయితే ఆయన కృష్ణుడి వేషం వేస్తే ఆయనే కృష్ణుడు.. రాముడు వేషం వేస్తే రాముడు.. రావణుడు అయితే రావణుడు.. అర్జునుడు, శివుడు, దుర్యోధనుడు, కర్ణుడు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది.. ఏ పాత్ర అయినా అది ఆయన కోసమే పుట్టినట్టు ఉంటుంది. పలు వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న యుగ పురుషుడు ఎన్టీఆర్. నటుడిగానే కాకుండా..దర్శకుడిగా..నిర్మాతగా స్టూడియో అధినేతగా…రాజకీయ వేత్తగా….ముఖ్యమంత్రిగా ఎవరికి సాధ్యం కాని రికార్డులను సృష్టించిన బహుముఖ ప్రఙ్ఞాశాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

1923 మే 28న లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు జన్మించిన ఎన్టీఆర్ మొదట ప్రభుత్వ ఉద్యోగం చేయగా.. సినిమా అవకాశం రావడంతో ఉద్యోగాన్ని వదిలేసి సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ దర్శక నిర్మాత బి.ఏ.సుబ్బారావు ‘పల్లెటూరిపిల్ల’ చిత్రంలో అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా ఆలస్యం కావడంతో ఎల్వీ ప్రసాద్ డైరెక్షన్ లో ‘మనదేశం’ సినిమా లో అవకాశం రావడంతో దానిలో నటించారు. అలా.. ఎన్టీఆర్ నటించిన తొలిచిత్రం ‘మనదేశం’ అయ్యింది. ఆ తర్వాత పల్లెటూరి పిల్ల విడుదలైంది. ఆ తర్వాత ఎన్టీఆర్, జానకి హీరోహీరోయిన్లుగా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో ‘షావుకారు’ నిర్మించారు. 1951లో కె.వి.రెడ్డి డైరెక్షన్ లో విజయా వారు నిర్మించిన ‘పాతాళ భైరవి’ సినిమాతో ఎన్టీఆర్‌ సినీ కెరీరే మారిపోయింది. ఎన్నో సినిమాలు.. ఎన్నో రికార్డ్స్ ఆ మహానుభావుడి సొంతం. ఎన్టీఆర్ తన 44 ఏళ్ళ సినీ జీవితంలో 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక మరియు, 44 పౌరాణిక చిత్రాలు చేసి తెలుగు తెర పై చెరగని ముద్ర వేసారు. ఇప్పటికీ ఆయన క్రియేట్ చేసిన రికార్డ్స్ కొన్ని ఆయనకే సొంతం.

సినీ రంగంలోనే కాదు… రాజకీయ‌రంగంలోనూ తనదైన ముద్రను వేసారు యన్టీఆర్. తెలుగు వాడి ఆత్మ గౌరవం అనే నినాదంపై తెలుగు దేశం పార్టీని స్థాపించి. కేవలం 8 నెలల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం రాజకీయ చరిత్రలోనే సంచలనం. ఇలా… సినీ, రాజ‌కీయ రంగాల్లో పెను సంచలనాలకు చిరునామాగా నిలిచిన ఎన్టీఆర్ ది నేడు 25వ వర్థంతి. మరి భౌతికంగా ఆయన ఇక్కడ లేకపోయినా.. సినిమా ఉన్నంత కాలం ఎన్ని ఏళ్ళైనా తెలుగువారి గుండెల్లో ఆయన ఎప్పటికీ ‌ బ్రతికే ఉంటారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =