కామెడీ ఎంటర్ టైనర్ “అందాల రాముడు”

Actor Sunil Starrer Andala Ramudu Is A Perfect Comedy Entertainer

సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై లక్ష్మీ నారాయణ పి దర్శకత్వంలో కమెడియన్ సునీల్ , ఆర్తి అగర్వాల్ జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “అందాలరాముడు “మూవీ ఘనవిజయం సాధించింది. కమెడియన్ గా 100 సినిమాలకు పైగా తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించిన సునీల్ “అందాల రాముడు” (2006 ) మూవీ తో హీరోగా మారారు. తమిళ సూపర్ హిట్ “సుందర పురుషన్ “మూవీ తెలుగు రీమేక్ మూవీ గా “అందాల రాముడు” రూపొందింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అందాల రాముడు” మూవీ లో హీరో ఆకాష్ ఒక ముఖ్య పాత్రలో నటించారు. కోట శ్రీనివాసరావు , బ్రహ్మానందం , ధర్మవరపు సుబ్రహ్మణ్యం , వేణు మాధవ్ , కొండ వలస తమ కామెడీ తో ప్రేక్షకులను అలరించారు. ఎస్ ఎ రాజ్ కుమార్ సంగీతం అందించారు. “అందాల రాముడు” మూవీ లో అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి సునీల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన టెర్రిఫిక్ డ్యాన్స్ లతో సునీల్ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశారు. కామెడీ టైమింగ్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో మంచి నటనను సునీల్ ప్రదర్శించారు. “అందాల రాముడు” మూవీ కి సినిమాటోగ్రఫీ , డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కామెడీ తో పాటు సెంటిమెంట్ పార్ట్ ను అద్భుతంగా తెరకెక్కించి దర్శకుడు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. “అందాల రాముడు” మూవీ సునీల్ కు హీరోగా శుభారంభం ఇచ్చింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =