కరోనా వల్ల ఇన్ని నెలలు షూటింగ్ లకు బ్రేక్ పడింది. అయితే ఈమధ్య షూటింగ్ లు మొదలుపెట్టి ఒక్క షెడ్యూల్ లోనే దాదాపు షూటింగ్లను పూర్తి చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు సింగల్ షెడ్యూల్ లోనే షూటింగ్లను ముగించేసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో గాలి సంపత్ సినిమా కూడా చేరిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అనీష్ కృష్ణ దర్శకత్వంలో శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరోహీరోయిన్లుగా గాలి సంపత్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ను పోయిన నెలలోనే ప్రారంభించారు. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ అరుకులో ప్రారంభమవగా.. సుమారు 25 రోజులపాటు అరుకు, విశాఖపట్నంలో తొలి షెడ్యూల్ను తాజాగా పూర్తి చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. వైజాగ్ షెడ్యూల్ పూర్తయిందని.. సుడిగాలి వేగంగా షూటింగ్ చేసి.. ఈ తొలి షెడ్యూల్లో ఏకంగా 80 శాతం చిత్రీకరణను పూర్తి చేశామని చెప్పారు.
Wrapped Up our #GaaliSampath‘s Vizag Schedule in Sudigali way🌪 🎬 & also Done with 80% Shoot 💪🏽🤘🏽
Cant wait to Share this amazing Experience with u all Soon 🤩@AnilRavipudi @sreevishnuoffl #RajendraPrasad @YoursSKrishna #Anish @achurajamani @imagesparkent pic.twitter.com/80TujSdPhL
— Shine Screens (@Shine_Screens) December 16, 2020
కాగా ఈ మూవీని ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బేనర్ పై ఎస్. క్రిష్ణ, షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై మజిలీ వంటి హిట్ చిత్రాలు నిర్మించిన సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో కలిసి నిర్మిస్తున్నారు. ఎస్. క్రిష్ణ పటాస్ నుండి సరిలేరు నీకెవ్వరు వరకూ అనిల్ రావిపూడి అన్ని చిత్రాలకు కో డైరెక్టర్, రైటర్ గా వర్క్ చేశారు. ఇప్పుడు మొదటిసారి నిర్మాతగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని సమర్పిస్తూ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సత్య, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్, మిర్చి కిరణ్, సురేంద్ర రెడ్డి, గగన్, మిమ్స్ మధు, అనీష్ కురువిల్లా, రజిత, కరాటే కళ్యాణి, సాయి శ్రీనివాస్, రూపలక్ష్మి తదితరులు నటిస్తున్నారు.
ఈ సినిమాతో పాటు ” రాజ రాజ చోర” సినిమాతో బిజీ గా వున్నాడు. హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ రాగా ఇప్పుడు మళ్లీ షూట్ ను ప్రారంభించారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























