పోల్ గేమ్ : టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్?

Poll Game: Who Is The Most Eligible Bachelor Among These Tollywood Heroes ?

ప్రభాస్: ‘ఈశ్వర్ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ప్రభాస్ “వర్షం “, ఛత్రపతి “, “బిల్లా “, “డార్లింగ్ “, “Mr పర్ ఫెక్ట్ “, “మిర్చి” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీస్ “బాహుబలి”,”బాహుబలి 2 ” మూవీస్ తో ప్రభాస్ ప్రపంచవ్యాప్తం గా గుర్తింపు పొందారు. బాలీవుడ్ లో ప్రభాస్ పై క్రేజ్ ఉన్నప్రేక్షకులు స్టైలిష్ మూవీ “సాహో” కి బ్రహ్మరథం పట్టారు. ప్రభాస్ ప్రస్తుతం “రాధేశ్యామ్ ” మూవీ లో నటిస్తున్నారు. హీరో ప్రభాస్ తో రూపొందే మూవీస్ అన్నీ పాన్ ఇండియా మూవీస్ గా రూపొందడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విజయ్ దేవరకొండ: బ్లాక్ బస్టర్ “పెళ్ళిచూపులు” మూవీ తో హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయిన విజయ్ దేవరకొండ సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. ప్రేమకథల హీరోగా పేరుపొందిన విజయ్ బ్లాక్ బస్టర్ “గీత గోవిందం ” మూవీ తో స్టార్ హీరోగా మారారు. విజయ్ పై ప్రేక్షకులలో క్రేజ్ పెరిగిపోయింది. విజయ్ హీరోగా నటించిన “టాక్సీవాలా ” మూవీ విజయం సాధించింది. విజయ్ ప్రస్తుతం , పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “ఫైటర్” లో నటిస్తున్నారు. ఈ మూవీ తో విజయ్ బాలీవుడ్ కు ఎంటర్ అవుతున్నారు.

రామ్ పోతినేని : బ్లాక్ బస్టర్ “దేవదాసు ” మూవీ తో రామ్ పోతినేని హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆమూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రామ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “రెడీ ” , “కందిరీగ “, “పండగ చేస్కో “, “నేను శైలజ ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. చాక్లెట్ బాయ్ లా ఉండే రామ్ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ లో పక్కా తెలంగాణ పోరడు గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకున్నారు. రామ్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “RED ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

వరుణ్ తేజ్: మెగా బ్రదర్ నాగేంద్ర బాబు తనయుడు వరుణ్ తేజ్ “ముకుంద” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన వార్ మూవీ “కంచె ” తో వరుణ్ తేజ్ గుర్తింపు పొందారు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన “ఫిదా “, “తొలిప్రేమ “, “F 2 “, “గద్దలకొండ గణేష్ ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న “#VT 10 ” మూవీ లో నటిస్తున్నారు. బాక్సర్ గా నటిస్తున్న వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.

పోల్ గేమ్ : టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =