భారతీయ చిత్ర పరిశ్రమలోని నటీనటులకు, ప్రత్యేకించి మన టాలీవుడ్ లోని ప్రముఖులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. ఇదే క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవికి ఒక అరుదైన గౌరవం దక్కింది. ఎమిరేట్స్ ఫస్ట్ ప్రత్యేక గోల్డెన్ వీసాను మెగాస్టార్‌కి అందించింది. తద్వారా ఈ గౌరవం అందుకున్న తొలి తెలుగు నటుడిగా చిరంజీవి నిలిచారు. ఇక స్పెషల్ గోల్డెన్ వీసా పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన చిరంజీవి ఎమిరేట్స్ ఫస్ట్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మేరకు ఎమిరేట్స్ ఫస్ట్ వ్యవస్థాపకుడు జమాద్ ఉస్మాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా తెలిపారు.. “ఎమిరేట్స్ ఫస్ట్ టీమ్ నుండి ప్రత్యేకమైన గోల్డెన్ వీసాని మిస్టర్ చిరంజీవికి సగర్వంగా అందిస్తున్నాను. తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్‌కి అసాధారణమైన గుర్తింపు. ఇది ఏ ఇతర గోల్డెన్ వీసా లాంటిది కాదు – కానీ ఎమిరేట్స్ చేత అసమానమైన లెజెండ్‌ను జరుపుకోవడానికి రూపొందించిన గౌరవం. ఇందుకు సహకరించిన నయీమ్ మూసాకు ప్రత్యేక ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.
View this post on Instagram
View this post on Instagram
ఇక ఇది తాము ప్రాసెస్ చేసిన అత్యంత వేగవంతమైన మరియు విలువైన గోల్డెన్ వీసా అని, ఇంత గొప్ప నటుడి వీసాను ప్రాసెస్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు అని సదరు ప్రతినిధులు తెలియజేశారు. కాగా ఇటీవలే కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా అందించిన విషయం తెలిసిందే. యూఏఈ ప్రభుత్వం అధికారికంగా అందించే ఈ ప్రత్యేక వీసాల కోసం 2019లో స్పెషల్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేసింది.
యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్న భారత ప్రముఖులు వీరే..!
బాలీవుడ్ నుంచి షారుఖ్‌ఖాన్, సంజయ్ దత్, సునీల్ శెట్టి, మౌనీ రాయ్, ఫరా ఖాన్, బోనీ కపూర్ ఫ్యామిలీ, నేహా కక్కర్, సింగర్ సోనూ నిగమ్.. కోలీవుడ్ నుంచి త్రిష, అమలాపాల్.. మాలీవుడ్ నుంచి మోహన్ లాల్, మమ్ముట్టి, టోవినో థామస్, దుల్కర్ సల్మాన్ తదితరులు ఇంతకుముందు ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు.
ఇక టాలీవుడ్ నుంచి ఈ వీసా అందుకున్న మొదటి వ్యక్తిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల నిలిచారు. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఆమె భర్త షోయెబ్ మాలిక్ కూడా యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























