బోయపాటి సినిమాలో బాలయ్య విలన్ కాదట…!

Nandamuri Balakrishna Not Playing The Villain Says Director Boyapati Srinu
Nandamuri Balakrishna Not Playing The Villain Says Director Boyapati Srinu

బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకోగా, రెండో షెడ్యూల్ కోసం ఎదురుస్తుంది. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తాజాగా ఈ సినిమాలో బాలకృష్ణ నెగెటివ్ రోల్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమాలో బాల‌కృష్ణ రెండు పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందులో ఒకటి నెగిటివ్ పాత్ర అన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదంటున్నారు. సినిమా స్టార్టింగ్ లో అత‌ని పాత్ర కాస్త నెగెటివ్ షేడ్ లో ఉంటుంది కాని విల‌న్ కాదు అని టాక్. బాల‌కృష్ణ‌ని ఈ చిత్రంలో స‌రికొత్త లుక్‌లో చూపించ‌నున్నాడ‌ట బోయ‌పాటి శీను.

ఇక ఈసినిమాలో ఓ పవర్‌ఫుల్‌ విలన్‌ పాత్ర కోసం భూమికను బోయపాటి ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి అసలు విలన్ ఎవరో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

మరి ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సూపర్ హిట్ అవ్వగా..ఇప్పుడు హ్యాట్రిక్ మూవీకి రెడీ అవుతున్నారు. చూద్దాం మరి హ్యాట్రిక్ కొడతారేమో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + one =