విలన్ అంటే ఎలా ఎలా ఉండాలో తెలిపిన మనిషి రావు గోపాల్ రావు. అయన నటనను వారసత్వంగా పుణికిపుచ్చుకుని ఇప్పుడు టాలీవడ్ లో విలక్షణ నటుడిగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. తండ్రి అయినా.. విలన్ అయినా.. కామెడీ పండించడంలో అయినా ఏ క్యారెక్టర్ అయినా సరే ఆయన అందులో పరకాయ ప్రవేశం చేసేస్తాడు. ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, టిపికల్ బాడీ లాంగ్వేజ్ ఆయన్ను తెలుగు ప్రజల్లో ఆయనకు సెపరేట్ ఐడెంటీని క్రియేట్ చేశాయి. ప్రస్తుతం అయన స్టార్ హీరోల దగ్గర నుండి చిన్న హీరోల వరకు అందరి సినిమాల్లో మంచి పాత్రలతో దుమ్మురేపుతున్నారు. అయితే తన నటనతో అందరినీ అలరిస్తున్న రావు రమేష్ కు మాత్రం నటన అంటే అస్సలు ఇష్టం లేదంట..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి చెప్పారు.”మొదటి నుంచి కూడా నాకు దర్శకుడిని కావాలనే ఉండేది. నటుడిని కావాలని ఎప్పుడూ అనుకోలేదు .. దానిపై పెద్దగా ఆసక్తి కూడా ఉండేది కాదు. నేను దర్శకుడిని అవుతానని మా అమ్మతో చెప్పాను. ‘అదంత తేలికైన పని కాదురా .. చాలా కష్టం. చాలా విషయాలపైన చాలా అవగాహన ఉండాలి. దానికంటే నటనే తేలిక .. నువ్వు నటనవైపే వెళ్లు. ఎందుకనో నువ్వు నటనలోనే రాణిస్తావని అనిపిస్తోంది’ అని అంది. అమ్మమాట కదా .. విన్నాను. అందుకే ఇప్పుడు ఈ స్థాయిలో వున్నాను” అని చెప్పుకొచ్చారు. మరి ఒకవేళ రావు రమేష్ కనుక డైరెక్షన్ వైపు వెళ్తే ఒక మంచి నటుడిని కోల్పోయేవాళ్ళం మనం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























