వెంక‌టేష్ `కలిసుందాం…రా!`కు 20 వ‌సంతాలు

Venkatesh Kalisundam Raa Completes 20 Years

“కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం…
అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం…
గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చూసే…
కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్ర‌ధ‌నుసు విరిసే…
వస్తారా మా ఇంటికి ప్రతిరోజూ సంక్రాంతికి”…
కుటుంబం కలసి ఉంటే ఎంత గొప్పగా ఉంటుందో దిగ్గజ రచయిత వేటూరి సుందరరామమూర్తి అందించిన ఈ సాహిత్యంతో వ‌చ్చిన ఆ చిత్ర‌మే `కలిసుందాం…రా!`.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

అగ్ర కథానాయకుడు విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా పలు విజ‌య‌వంత‌మైన‌ కుటుంబకథా చిత్రాలు వ‌చ్చాయి. వాటిలో `కలిసుందాం…రా!` ఒక‌టి. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మూవీ మొఘ‌ల్ డి.రామానాయుడు స‌మ‌ర్ప‌ణ‌లో డి.సురేష్ బాబు నిర్మించిన ఈ మ్యూజిక‌ల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ఉదయశంకర్ దర్శకుడిగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యాడు. వెంకీకి జోడీగా సిమ్రాన్ న‌టించ‌గా… కె.విశ్వనాధ్, రంగనాథ్, శ్రీ‌హ‌రి, వెన్నిరాడై నిర్మల, సి.ఆర్.విజయకుమారి, అన్నపూర్ణ, సుధ, రాళ్ళ‌ప‌ల్లి, ర‌మాప్ర‌భ‌, బ్ర‌హ్మానందం తదితరులు ఇత‌ర ముఖ్య‌పాత్ర‌లు పోషించారు.

వేటూరి సుందరరామమూర్తి, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, చంద్రబోస్ గీత రచ‌న చేయగా… ఎస్.ఎ.రాజ్ కుమార్ అలరించే బాణీల‌ను అందించారు. “కలిసుంటే కలదు సుఖం”, “నువ్వే నువ్వే”, “ప్రేమ ప్రేమ”, “పసిఫిక్ లో”, “మనసు మనసు”, “నచ్చావే పాలపిట్ట”, “బూమ్ బూమ్” పాట‌లు సంగీత‌ ప్రియుల నీరాజ‌నాలు అందుకున్నాయి. ఉత్తమ ప్రాంతీయ‌ చిత్రంగా జాతీయ పుర‌స్కారాన్ని అందుకున్న‌ `కలిసుందాం…రా!` ను ‘కుచ్ తుమ్ కహో కుచ్ హమ్ కహెన్’ పేరుతో హిందీలోనూ పునర్నిర్మించారు. ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ న‌టుడు, ఉత్త‌మ స‌హాయ న‌టుడు, ఉత్త‌మ క‌థా రచ‌యిత విభాగాల‌లో ఈ చిత్రం నాలుగు `నంది` పుర‌స్కారాల‌ను సొంతం చేసుకుంది. 2000 జ‌న‌వ‌రి 14న విడుదలై ఘ‌న‌విజ‌యం సాధించిన‌ `కలిసుందాం…రా!`… నేటితో 20 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − five =