పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ బాట పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. `పింక్` రీమేక్ ని తన పునరాగమనానికి వేదికగా చేసుకున్న పవన్.. ఆపై టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో ఓ సినిమా చేయబోతున్నారని సమాచారం. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు నాటి కాలంలో సాగే ఈ పిరియాడికల్ ఫిల్మ్ లో పవన్.. రాబిన్ హుడ్ తరహా పాత్రలో దర్శనమిస్తారని తెలిసింది. అంటే.. అవినీతిపరులైన పెద్దల సొమ్మును కొట్టి పేదలకు సాయం చేసే దొంగగా పవర్ స్టార్ కనిపిస్తాడన్నమాట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఎంతో ఉన్నతంగా ఉండేలా ఈ పాత్రను డిజైన్ చేశాడట దర్శకుడు క్రిష్. మరి… సరికొత్త తరహా పాత్రలో పవన్ ఏ స్థాయిలో రంజింపజేస్తాడో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. కాగా, పవన్ – క్రిష్ కాంబో ఫిల్మ్ ని ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం నిర్మించనున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: