ఫైటర్ కోసం థాయ్ స్పెషలిస్టులు

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే సినిమా బిజీలో వున్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఫిబ్రవరి లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత పూరీ-విజయ్ కంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇక ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ గా కనిపించనున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. విజయ్ దేవరకొండ మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్.. నేర్చుకునేందుకు థాయ్ ల్యాండ్ వెళ్లాడట. అక్కడ అతడికి ఏకంగా 15 మంది థాయ్ స్పెషలిస్టులు మిక్స్ డ్ మార్షల్ విద్యల్లో కఠోరమైన శిక్షణను ఇవ్వనున్నారట. కిక్ బాక్సింగ్.. కరాటే..కుంగ్ ఫూ.. థైక్వాండో.. కర్ర ఫైట్ వీటన్నిటినీ మిక్స్ చేసే శిక్షణ ఇది. ఈ విద్యల్లో పూర్తిగా శిక్షణ తీసుకున్నాక విజయ్ తిరిగి వస్తాడట. అంతేకాదు.. స్ట్రిక్ట్ గా డైట్ ను మెయింటెయిన్ చేస్తున్నాడట. చూద్దాం మరి హీరోలను ఓ రేంజ్ లో చూపించడంలో పూరీ కి ఉన్న స్టయిలే వేరు… ఈ సినిమాలో విజయ్ ను ఏ రేంజ్ లో చూపిస్తారో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =