సక్సెస్ కు మారుపేరైన దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్, శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థల తో టాలీవుడ్ లో విజయ కేతనం ఎగురవేస్తున్నారు. బ్లాక్ బస్టర్ “దిల్ ” మూవీ తో నిర్మాత గా టాలీవుడ్ కు పరిచయం అయిన దిల్ రాజు అనేక సూపర్ డూపర్ హిట్ సినిమాలను నిర్మిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సుకుమార్, బోయపాటి శ్రీను , వంశీ పైడిపల్లి, బొమ్మరిల్లు భాస్కర్, శ్రీకాంత్ అడ్డాల, వాసు వర్మ, వేణు శ్రీరామ్ లను దర్శకులుగా టాలీవుడ్ కు పరిచయం చేసిన ఘనత ఆయనదే . సినిమా తోడిదే లోకం, సినిమాలతో మమేకమై సక్సెస్ మంత్రం తెలుసుకొన్న దిల్ రాజు ఖర్చుకు వెనుకాడకుండా సినిమాలు నిర్మిస్తూ విజయాలు సాధిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ , డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు టాలీవుడ్ లో ఒక కొత్త రికార్డ్ ను క్రియేట్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందిన “దర్బార్” మూవీ జనవరి 9వతేదీ, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన “సరిలేరు నీకెవ్వరు ” మూవీ జనవరి 11 వ తేదీ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రూపొందిన “అల.. వైకుంఠపురములో .. మూవీ జనవరి 12 వ తేదీ, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన “ఎంత మంచివాడవురా ” మూవీ జనవరి 15 వ తేదీ సంక్రాంతి బరిలో ఉన్నాయి. ఈ నాలుగు సంక్రాంతి సినిమాల డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కావడం విశేషం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: