చంద్రముఖి సీక్వెల్ రెడీ..!

Chandramukhi Movie Sequel Is Ready,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Chandramukhi Movie Updates,Chandramukhi Telugu Movie Latest News,Chandramukhi Movie Sequel On Cards,Chandramukhi Telugu Movie Sequel On Cards

పీ వాసు దర్శకత్వంలో, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార, జ్యోతిక, ప్రభు ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హర్రర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మారధం పట్టారు. ఒక్క తమిళ్ లోనే కాదు.. తెలుగు లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక తమిళనాడులోని శాంతి థియేటర్‌లో 890 రోజులపాటు ఆడిందంటేనే అర్ధం చేసుకోవచ్చు.. ఈ సినిమా ఎలా ఆడిందో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ రెడీ అయినట్టు తెలుస్తుంది. గతంలో ఈ సినిమాకి సీక్వెల్ తీయబోతున్నారని వార్తలు వచ్చినా… కేవలం వార్తలకి మాత్రమే పరిమితం అయ్యాయి. అయితే ఇప్పుడు సీక్వెల్‌ తీస్తున్నానని దర్శకుడు పీ వాసు ప్రకటించాడు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ దాదాపుగా సిద్ధమైనట్టేనని, ప్రముఖ నిర్మాణ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పుకొచ్చాడు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరి చంద్రముఖి సినిమాలో రజినీ చేసిన నటన గురించి అందరికీ తెలిసిందే. ఆ సినిమా అంత హిట్ అయిందంటే.. రజినీ కాంత్ కూడా ఒక కారణం. మరి ఈ సినిమాలో రజినీకాంత్ నటిస్తాడా లేకా మరెవరైనా నటిస్తారా అన్నది చూడాలి మరి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + six =